Kid playing : వర్షపు నీటిలో బాలిక ఆటలు.. నెట్టింట వీడియో వైరల్!

ఒక్కసారి తిరిగి వెనక్కి చూసుకుంటే గతమే మనకు చాలా అందంగా కనిపిస్తుంది.ముఖ్యంగా బాల్యంలో మనం గడిపిన క్షణాలు మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.

ఒక్కసారి మన చుట్టూ వున్న చిన్న పిల్లలను చూస్తే మనం ఒక్క క్షణం మన బాల్యంలోకి వెళ్ళిపోతాము.బేసిగ్గా చిన్న పిల్లలకు నీటిలో ఆడటం అంటే మహా ఇష్టం.

తల్లిదండ్రులు వద్దని వారించినా వినిపించుకోరు.నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ రచ్చ రచ్చ చేస్తారు.

స్కూలుకు వెళ్ళేటప్పుడు కూడా రోడ్డుపైన నీళ్లు కనిపిస్తే మైమరచిపోయి వేసుకున్న డ్రెస్ పాడైపోయినా నీటిలో గెంతుతూ వుంటారు.మనలో ప్రతిఒక్కరూ ఈ దశను దాటినవారే.

Advertisement

తాజాగా అలాంటి ఓ క్యూట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ బేబీ స్కూలుకు వెళ్తూ రోడ్డు పక్కన వున్న చిన్న గుంతలో కనిపించిన నీటిలో గంతులేస్తూ ఆడుకుంటున్న వీడియో నెటిజన్లను చాలా తీవ్రంగా ఆకర్షిస్తోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఒకసారి చూస్తే ఓ అందమైన పాప చక్కగా స్కూల్‌ యూనిఫాం వేసుకొని ఉంది.దానిపైన పింక్‌ హుడీ కూడా ధరించింది.

దాన్ని బట్టి తానూ స్కూలుకి బయలు దేరిందని చెప్పవచ్చు.

అయితే తాను స్కూలికి వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన నీళ్లు కనపడగానే పరుగెత్తుకెళ్లి ఆ నీళ్లలో గంతులేస్తూ ఆటడం ఇక్కడ చూడవచ్చు.అలా ఆడుతూ ఆడుతూ ఆ చిన్నారి నీటిలో పడిపోవడం చూడవచ్చు.ఇక ఈ క్యూట్‌ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా లక్షలాదిమంది నెటిజన్లు లైక్స్ చేస్తున్నారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

అలాగే అనేకమంది తమ బాల్యంలోకి వెళ్లిపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆరోజుల్లో నేను కూడా అలాగే ఆడుకునేవాడిని ఒకరంటే, మా పాప కూడా అలాగే ఆడుతుంది.చెప్పినా వినదు.

Advertisement

అని ఓ పేరెంట్ కామెంట్ చేసాడు.

తాజా వార్తలు