సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా పండుగల సమయంలో రిలీజ్ కావడం జరుగుతుంది.బాలయ్య, రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడగా మెజారిటీ సందర్భాల్లో రవితేజ పైచేయి సాధించారు.
అయితే 2023 దసరా పండుగకు మాత్రం భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కాగా భగవంత్ కేసరి( Bhagavanth Kesari )బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.

అయితే బాలయ్య, రవితేజ మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. రీరిలీజ్ సినిమాలతో బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండగా ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.మార్చి నెల 1వ తేదీన కిక్ మూవీ రీరిలీజ్ కానుండగా మార్చి నెల 2వ తేదీన సమరసింహారెడ్డి మూవీ రీరిలీజ్( Samarasimha Reddy ) కానుంది.
రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమాలలో రీరిలీజ్ లో ఏ సినిమాకు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తాయో చూడాలి.

ఈ రెండు సినిమాలకు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు.కిక్, సమరసింహారెడ్డి సినిమాలకు రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తే బాలయ్య, రవితేజ నటించిన మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.థియేటర్లలో ఈ రెండు సినిమాలను చూస్తామని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ పోటీ హాట్ టాపిక్ అవుతోంది.ఒక్కరోజు గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలను రీరిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య, రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ఈ ఇద్దరు హీరోల పారితోషికాలు సైతం దాదాపుగా సమానంగా ఉన్నాయని తెలుస్తోంది.







