భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి పంట( Cotton crop ) కూడా ఒకటి.పత్తి పంట సాగు విధానంపై అవగాహన ఉంటే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందవచ్చు.
మిగతా పంటలతో పోలిస్తే పత్తి పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.సకాలంలో వీటిని గుర్తించి తొలి దశలోనే అరికట్టాలి.
వేసవి కాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకొని, ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పూర్తిగా తొలగిస్తే.పత్తి పంటకు భూమి నుంచి ఆశించే తెగుళ్ల బెడద చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.
మొక్కల మధ్య 40 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.ఈ విధంగా దూరంగా నాటుకుంటే కలుపును నాగలితో చాలావరకు అంతర కృషి చేసి తొలగించవచ్చు.
మొక్కలు ఏపుగా పెరుగుతాయి.మొక్కల మధ్య అధిక దూరం ఉంటే చీడపీడలు( pests ) లేదంటే తెగులు ఆశిస్తే వ్యాప్తి తక్కువగా ఉంటుంది.

పత్తి పంటకు గులాబీ పురుగుల బెడద ( pink insects )చాలా ఎక్కువ.ఈ పురుగులు పంటను ఆశిస్తే ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి.ఈ పురుగులను పంట పొలంలో గుర్తించిన తర్వాత ఒక లీటరు నీటిలో 100 మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ ను కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటరు నీటిలో 100 ml క్లోరోపైరిఫాస్( Chlorpyrifos ) ను కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ పురుగులను పూర్తిగా అరికట్టాలి.