హైదరాబాదు నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు బీజేపీ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
దీంతో హైదరాబాద్ నగరం మొత్తం మోడీ బ్యానర్లు మరియు పోస్టర్ లు.హోర్డింగ్ లతో నిండిపోయింది.మరోపక్క ప్రధానికి వ్యతిరేకంగా కూడా పోస్టర్ లు మరియు బ్యానర్ లు వివిధ హోర్దింగ్ లు ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఇదంతా అధికార పార్టీ టిఆర్ఎస్ దే అని బీజేపీ పార్టీకి భయపడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తమిళనాడు బీజేపీ నేత సినీ నటి ఖుష్బూ… హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం పట్ల అసహనం వ్యక్తం చేశారు.మోడీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ చేస్తున్న ప్రచారం బట్టి చూస్తే కెసిఆర్ కి మోడీ అంటే ఎంత భయమో అర్థమవుతుందని తెలిపారు.
అందువల్లే మూడోసారి కూడా ప్రధాని మోడీకి స్వాగతం పలకడానికి కేసిఆర్ వెళ్ళటం లేదని ఆయన ఆలోచన విధానం.ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.కచ్చితంగా రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటూ ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు.







