మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.అయితే ఈ సినిమాను మాస్ రాజా అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మాస్ అంశాలు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా చూపించేందుకు చిత్ర యూనిట్ ఏమాత్రం వెనుకాడటం లేదని తెలుస్తోంది.
ఈ సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్ బడ్జెట్ మూవీగా మారింది.ఈ సినిమా కోసం ఏకంగా రూ.65 కోట్ల బడ్జెట్‌ను చిత్ర యూనిట్ కేటాయించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాను అతి త్వరలో ముగించుకుని రిలీజ్‌కు రెడీ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయగా, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలంగా మారనుందట.
మాస్ రాజా రవితేజ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా తీసుకెళ్లనున్నట్లు చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు నటిస్తుండగా, ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ కొడతాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.మరి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్లో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.