ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేస్తున్న దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.శ్రీ కృష్ణుని రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
వివాదం, కోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో నిర్వాహకులు విగ్రహంలో మార్పులు చేశారు.విగ్రహానికి కలర్ మార్చి గోల్డ్ కలర్ వేస్తున్నారు.
దాంతో పాటు విగ్రహం వెనుక భాగంలో ఉన్న విష్ణుచక్రం, పిల్లనగ్రోవీని తొలగించారని తెలుస్తోంది.







