కర్ణాటకలో వరుసగా రెండు దఫాలు అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపికి షాక్ ఇస్తూ కన్నడ ప్రజలు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యాన్ని కట్టబెట్టారు.హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావించారు.
ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పడం జరిగింది.కానీ కాంగ్రెస్ పార్టీ( Congress party ) స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని దక్కించుకుంది.
కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాట.చాలా సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా నాకు పదవి కావాలి.
నాకు పదవి కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం ఏ స్థాయి యుద్ధం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సిద్ధరామయ్యను( Siddaramaiah 0 ముఖ్యమంత్రిగా చేసి డీకే శివకుమార్( DK Shivakumar ) ని ఉప ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు అత్యంత కీలకమైన శాఖలను కట్టబెట్టడం జరిగింది.దాంతో ఆయన కాస్త శాంతించినట్లుగా కనిపిస్తున్నాడు.కానీ ఏ సమయంలో ఆయన భరస్ట్ అవుతాడు అనేది తెలియదు.పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివకుమార్ ముందు ముందు సిద్దరామయ్యకు తిరుగుబాటు బావుట ఎగరవేస్తే పరిస్థితి ఏంటి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో పార్టీకి చెందిన మరి కొందరు సీనియర్ నాయకులు కూడా తమకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని.మంత్రి పదవి కావాలని అధినాయకత్వం వద్ద డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వం పైన సంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిండా ఐదు సంవత్సరాలు సాగేనా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంపూర్ణ ఆధిక్యం దక్కించుకున్న కూడా కొద్ది పాటి ఎమ్మెల్యేలు అటు వైపు జంప్ అయితే కర్ణాటక ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది.కనుక కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరిచే విధంగా పార్టీ అధినాయకత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఒకవైపు పార్టీ అధినాయకత్వం రాష్ట్ర ముఖ్య నాయకులను సంతృప్తి పరచడంతో పాటు మరో వైపు కర్ణాటకలో రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది.
అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశ పడుతుంది.ఏం జరుగుతుందో చూడాలి.







