తాము భారత్‌లో అంతర్భాగం కాలేమని, తమకు ప్రత్యేక దేశం కావాలని కొందరు పంజాబీలు ఖలిస్థాన్ ఉద్యమాన్ని నడుపుతున్నారు.ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో వారిష్ పంజాబ్ డి’ సంస్థ అధిపతి అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు.ఈ తరుణంలో ఆయనకు మద్దతుగా ఖలీస్తాన్( Khalistan ) సపోర్టర్లు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తమ దుందుడుకు వైఖరిని ప్రదర్శించారు.
ఖలీస్తాన్ నిరసనకారుల బృందం భారతీయ కాన్సులేట్ పై దాడి చేసింది.పంజాబ్‌లో అమృత్‌పాల్ సింగ్ సహచరులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఖలీస్తానీ జెండాలను అక్కడ ఎగుర వేశారు.
దీనిపై శాన్‌ఫ్రాన్సిస్కో(
San Francisco ) పోలీసులు ఇంకా స్పందించలేదు.
నిరసనకారులు కాన్సులేట్ ప్రాంగణం లోపల ఖలీస్తానీ జెండాలను ఎగుర వేశారు.లోపలికి దూరి, తమ చేతుల్లోని ఇనుప రాడ్లతో తలుపులు, కిటికీలపై దాడి చేశారు.శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై ఖలీస్తాన్ మద్దతుదారులు చేసిన దాడిని అమెరికా ఖండించింది.
అదే సమయంలో, దేశంలో భారత దౌత్యవేత్తల భద్రతను పెంచుతామని అమెరికా పేర్కొంది.మరో వైపు ఖలిస్తాన్ వేర్పాటువాదుల దుశ్చర్యపై భారతీయ-అమెరికన్లు( Indian-Americans ) తీవ్రంగా ఖండించారు.
దీనికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శాన్ఫ్రాన్సిస్కోలోని భారతదేశ కాన్సులేట్ భవనంపై ఖలిస్తాన్ వేర్పాటు వాదుల దాడిని భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ భూటోరియా( Ajay Bhutoria ) ఖండించారు.ఈ హింసాత్మక చర్య అమెరికా, భారతదేశాల మధ్య దౌత్య సంబంధాలకు మాత్రమే కాకుండా, మన సమాజం శాంతి, సామరస్యాలపై దాడి కూడా అని అభివర్ణించారు.ఈ దాడికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.