కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో మాస్ వర్గాలు ఈ సినిమాకు అడిక్ట్ అయిపోయారు.
దీంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.ఇక ఈ సినిమాలో కన్నడ హీరో యశ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కాగా ఈ సినిమాకు సీక్వెల్ అయిన కేజీఎఫ్ ఛాప్టర్ 2ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సనిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
దీంతో యశ్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా రిలిజ్‌పై పలు అనుమానాలు రేకెత్తాయి.
అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేయడం కుదరదని హీరో యశ్ తేల్చి చెప్పారు.
ఈ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని థియేటర్స్‌లోనే చూడాలని ఆయన తెలిపారు.కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.







