కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఇప్పటికే వచ్చిన కేజీఎఫ్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మొదటి నుండి ప్రశాంత్ నీల్ చెబుతూ వచ్చాడు.ఈ సినిమా లో యశ్ తన పాత్రను కొనసాగించనుండగా కొత్త గా మాత్రం సంజయ్ దత్ కనిపించబోతున్నాడు.
బాలీవుడ్ స్టార్ అయిన సంజయ్ దత్ ఈ సినిమా లో విలన్ గా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
అద్బుతమైన విజువల్ వండర్ అంటూ ఈ సినిమా ను ప్రమోట్ చేయడంతో పాటు ప్రతి విషయంలో కూడా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అవసరం అయిన చోట రీ షూట్ లు చేస్తున్నాడు.
కరోనా వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.అలాగే సినిమా విడుదల తేదీని కూడా మార్చారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.
సంజయ్ దత్ తో దగ్గరుండి మరీ ప్రశాంత్ నీల్ డబ్బింగ్ చెప్పించాడు.

హిందీ వర్షన్ తో పాటు కన్నడ వర్షన్ కు కూడా సంజయ్ దత్ డబ్బింగ్ చెప్పాడని అంటున్నారు.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.సంజయ్ దత్ వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగింది అంటున్నారు.
ఖచ్చితంగా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని బాహుబలి రికార్డు ను బ్రేక్ చేస్తుందని అంటున్నారు.కన్నడ సినిమా లు 50 కోట్లు వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం.
కాని ఇప్పుడు 250 కోట్లు కూడా కేజీఎఫ్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.