ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చెట్లు వలన ప్రకృతి కి అదే విధంగా మనిషికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పుకొచ్చారు.మనిషి పీల్చే గాలి ఆక్సిజన్ చెట్ల వలన లభిస్తుందని అది చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

కార్బన్ డయాక్సైడ్ తీసుకుని పగటి పూట ఆక్సిజన్ చెట్లు అందిస్తాయని ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని జగన్ పిలుపునిచ్చారు.రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.అంతే కాకుండా రాష్ట్రంలో చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా పడతాయని జగన్ చెప్పుకొచ్చారు.నాడు నేడు విభాగంలో హాస్పిటల్స్, పాఠశాల ఆవరణలో కూడా చెట్లు నాటాలని జగన్ పిలుపునిచ్చారు.
మంగళగిరి ఏం సవరణ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.ఏదిఏమైనా రాష్ట్రంలో చెట్ల పెంపకం అనేది ఒక యజ్ఞంలా జరగాలని ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.