రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసిందన్నారు.
ఎవరి పని వారు చేస్తే మంచిది లేదంటే వ్యవస్థలో అరాచకం వస్తుందని పేర్కొన్నారు.ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించుకోవాలని తెలిపారు.
మేమే గొప్ప అనుకుంటే ప్రజల్లో పలుచన అవుతామని వెల్లడించారు.వికేంద్రీకరణపై యాగీ చేస్తున్న జనసేన, టీడీపీ తీర్పుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బినామీ యాత్రలతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.రాజధాని అనేది మూడు ప్రాంతాల మనోభావాలకు సంబంధించిందన్న తమ్మినేని రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారు మూడు రాజధానులకు సహకరించాలని సూచించారు.
మూడు రాజధానులే అభివృద్ధికి శాశ్వత పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.