నవీన్ హత్య కేసు నిందితుడి రిమాండ్ రిపోర్ట్‎లో కీలక విషయాలు..

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడి రిమాండ్ రిపోర్ట్‎లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నిహారిక, నవీన్ లవ్ చేసుకుని విడిపోయారన్న నిందితుడు హరిహరకృష్ణ ఆ తర్వాత తను, నిహారిక ప్రేమించుకున్నామని పోలీసులకు తెలిపాడు.

నిహారికను ఇబ్బంది పెడుతున్నాడనే నవీన్ ను చంపానని పోలీసులకు వెల్లడించాడు.నవీన్ ను చంపాలని మూడు నెలలే క్రితమే డిసైడ్ అయ్యానన్నాడు.

ముందుగా జనవరి 16న చంపాలనుకున్న కుదరకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు పేర్కొన్నాడు.నవీన్ ను హత్య చేసిన తరువాత తన ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్లి పడుకున్నానన్నాడు.

అనంతరం నవీన్ ను చంపానని నిహారికకు చెబితే తనను తిట్టిందని చెప్పాడు.పోలీసులకు లొంగిపోవాలని నాన్న, తన ఫ్రెండ్ హాసన్ చెప్పారని హరిహరకృష్ణ తెలిపాడు.

Advertisement

దీంతో నవీన్ శరీరభాగాలను హత్య చేసిన ప్రాంతంలోనే కాల్చేసి.తరువాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించాడు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు