MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) రిమాండ్ రిపోర్టులో ఈడీ( ED ) కీలక విషయాలను పేర్కొంది.ఈ మేరకు మేకా శ్రీశరణ్ పేరును ఈడీ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది.

 Key Points In Mlc Kavithas Remand Report-TeluguStop.com

కవితను అరెస్ట్ చేసిన సమయంలో నిర్వహించిన సోదాల్లో మేకా శ్రీ శరణ్ ఫోన్ ను ఈడీ స్వాధీనం చేసుకుంది.ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని శ్రీ శరణ్ ను రెండుసార్లు పిలిస్తే హాజరుకాలేదని ఈడీ తెలిపింది.

ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్, కవిత మధ్య నగదు బదిలీల్లో మేకా శ్రీ శరణ్ పాల్గొన్నట్లు వెల్లడైందన్నారు.

పీఎంఎల్ఏ 2002 లోని సెక్షన్ 17 ప్రకారం మేకా శ్రీ శరణ్( Meka Sri Sharan ) నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొంది.లిక్కర్ కేసు( Liquor Case ) విచారణకు కవిత సహకరించడం లేదన్న ఈడీ కవిత పూర్తి విషయాలు బహిర్గతం చేయలేదని తెలిపింది.ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాలు నమోదు చేశామని, కస్టోడియల్ ఇంటరాగేషన్ లో కవిత తప్పించుకునే సమాధానాలు ఇస్తోందని ఈడీ వెల్లడించింది.

నలుగురు ఇతర నిందితుల వాంగ్మూలాలు కూడా తీసుకున్నామన్న ఈడీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ డేటాను ఫోరెన్సిక్ బృందం విశ్లేషిస్తోందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube