మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టోకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు దుద్దనున్నారని తెలుస్తోంది.అయితే ఈనెల 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తన మ్యానిఫెస్టోను ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టారు.ఈ నేపథ్యంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఆయన ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతల బుజ్జగింపులపై దృష్టి సారించనున్నారు.

Advertisement
వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

తాజా వార్తలు