ఏపీ మంత్రిమండలి ఇవాళ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు.
అర్హత ఉండి నవరత్నాల్లో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందని వారుంటే వారికి తిరిగి పథకాలు అందేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ఉచిత పంటల బీమా పసల్ యోజన భీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
మేకపాటి గౌతం రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఉద్యోగులకు జీతాలపై ఆమోద ముద్ర వేసింది.ఖరీఫ్ పంట 2022కు సాగునీటిని ముందుగానే విడుదల చేయడం వల్ల ఖరీఫ్ పంట త్వరగా చేతికి వచ్చిందన్నారు.అదేవిధంగా వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పనులతో పాటు, ఫించన్ దారులకు పెన్షన్ రూ.2750 చేసేందుకు ఆమోదం తెలిపింది.అంతేకాకుండా సంప్రదాయ ఇంధన వినియోగం 43 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, సున్నపురాయిపల్లిలో జేఎస్ డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వెల్లడించారు.