సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళితో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరో 3 నెలలు జరుగుతుందని తెలుస్తుంది.
అయితే ఈలోగా త్రివిక్రం సినిమా పూర్తి చేసి ఆ తర్వాత అనీల్ రావిపుడితో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట మహేష్.త్రివిక్రం, అనీల్ రావిపుడి మూవీ ఈ రెండు సినిమాలు రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేసేలా మహేష్ పర్ఫెక్ట్ షెడ్యూల్ అనుకున్నారట.
రాజమౌళి సినిమా అంటే ఎలా లేదన్న్నా రెండేళ్లు రాసి ఇచ్చేయాల్సిందే.అందుకే ఈలోగా రెండు సినిమాలు చేసి ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నారు మహేష్.

మహేష్ ప్లానింగ్ బాగానే ఉన్నా కూడా రెండు నెలల్లో మహేష్ రెండు సినిమాలు పూర్తి చేయడం మాత్రం కుదిరే పని కాదని చెప్పొచ్చు.ఎందుకంటే అనీల్ రావిపుడి ఆల్రెడీ బాలకృష్ణతో సినిమా మొదలు పెట్టాడు.ఆ సినిమాతో పాటుగా మహేష్ సినిమా చేయాల్సి ఉంటుంది.మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యాన్స్ ని అలరించడానికి రిస్క్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ గా సెన్సేషన్ సృష్టించాలని చూస్తున్న మహేష్ ఆ సినిమాతో తన రేంజ్ ఏంటన్నది ప్రూవ్ చేస్తాడని చెప్పొచ్చు.
.






