తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఎంపీలు నడిపే ఆసుపత్రులు, క్లినిక్లను మూసివేతకు రంగం సిద్ధం చేసింది.

 Key Decision Of Telangana Medical Health Department-TeluguStop.com

ఈ మేరకు వాటిని మూసివేయాలంటూ డిఎం హెచ్ఓలను డిహెచ్ శ్రీనివాస్ రావు ఆదేశించారు.అదేవిధంగా రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు.గత నాలుగు రోజులుగా నిర్వహించిన తనిఖీలలో లైసెన్స్ లు లేని 81 ఆసుపత్రులు సీజ్ చేశామన్నారు.64 ఆసుపత్రులకు జరిమానాలు విధించామని వెల్లడించారు.నోటీసులకు రెండు వారాల్లోగా స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube