థియేటర్ దొరకట్లే.. ఓటిటి ఒప్పుకోవట్లే..ఇంకేం ఉంది .. ఇదే అసలు ఉపాయం

సినిమాల్లో వాడే భాషకి మనం మన జీవితంలో ఉపయోగించే భాషకు సంబంధం ఉండదు.బూతులు మాట్లాడితే ఆ సినిమాకి సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి.

 Bandi Saroj Kumar Untold Story , Bandi Saroj Kumar, Mangalyam Movie, Tollywood,-TeluguStop.com

ఏలాంటి బూతు వీడియోలు లేకుండా బూతు మాటలతో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది ? ఆ సినిమా ఎవరు కొంటారు? థియేటర్లు ఎవరిస్తారు ? ఓటిటి ఆదరిస్తుందా ? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు సమాధానంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న ఒక సినిమా గురించి చూద్దాం.

ఒక సినిమా తీయాలంటే ఆర్టిస్టులకి డబ్బులు కట్టాలి, అనేక నష్టాలు, కష్టాలు ఉంటాయి పర్మిషన్ల బాధలు ఉంటాయి.

ఇవన్నీ జరిగాక సెన్సార్ తో ఇబ్బందులు ఉంటాయి.అందులో ఏమాత్రం బూతు సన్నివేశం ఉన్న, బూతు మాట్లాడిన కత్తెర వేస్తారు.

అయితే రియాలిటీ కి దగ్గరగా ఒక సినిమా తీస్తే క్రియేటివిటీ అని చెప్పుకుంటే సెన్సార్ ఒప్పుకోదు.ఇన్ని గండాలు గట్టెక్కాక థియేటర్లు దొరకడం అంటే ఆస్కార్ అవార్డు సాధించిన అంత కష్టంగా మారింది.

ఒకవేళ ఆ గండం కూడా దాటితే పబ్లిసిటీ కావాలి.కేవలం మౌత్ టాక్ బాగుంటేనే సినిమాకి ప్రేక్షకులు వస్తున్నారు.

ఈ బాధలన్నీ తట్టుకోలేక రాంగోపాల్ వర్మ పేపర్ వ్యూ అనే ఒక ఆప్ ని క్రియేట్ చేసుకుని డబ్బులు కట్టిన వాడికి సినిమా చూపించడం మొదలుపెట్టాడు.అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

ఓటీటిలు కాకుండా థియేటర్లో వేయకుండా విడుదల చేయాలంటే ఉన్న ఏకైక మార్గం యూట్యూబ్.

Telugu Google Pay, Mangalyam, Phone Pay, Theaters, Tollywood-Latest News - Telug

బండి సరోజ్ కుమార్ ఒక దర్శకుడు తీసిన సినిమా మాంగల్యం.ఈ సినిమాలో పచ్చి బూతులు ఉంటాయి.కానీ ఎక్కడ బూతు సీన్లు ఉండవు తన యూట్యూబ్లో తానే పెట్టేసుకున్నాడు.

కానీ సరిపోయే రెవెన్యూ రాదు కదా అందుకే ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు.మా సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే డబ్బులు ఇవ్వండి అంటూ గూగుల్ పే ఫోన్ పే నెంబర్లు పెట్టేసాడు.

నచ్చితేనే డబ్బులు ఇవ్వండి అంటూ అప్పీల్ చేసుకున్నాడు.ఇంకేంటి ఆ ఆఫర్ వర్కౌట్ అయింది.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.థియేటర్లో వేయకపోయినా కూడా సరిపడా డబ్బు వచ్చింది.

ఇలాంటి సినిమాలు ఇంకా రావాలనే ప్రేక్షకుల అభిలాషకు తగ్గట్టుగానే సినిమా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.కానీ వినడానికి జుగుబ్సకరంగా ఉన్న కొన్ని బూతులను ఈ సమాజం అంగీకరిస్తుందా అనే డిబేట్ కూడా కొనసాగుతుంది.

ఏది ఏమైనా ఉపాయం లేని ఊర్లో నుంచి వెళ్లగొట్టాలి అంటుంటారు.మరి ఈ ఉపాయంతో గట్టెక్కిన ఈ దర్శకుడిని చూస్తే అది నిజమే అని చెప్పక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube