ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu )కీలక వ్యాఖ్యలు చేశారు.

కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా ఉచిత పథకాల హామీలు ఇస్తున్నాయని తెలిపారు.

అయితే విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే తప్పులేదని వెంకయ్య నాయుడు చెప్పారు.కానీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు సరికాదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అయితే వెంకయ్య నాయుడు గతంలోనూ ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయా పార్టీలు తమ మ్యానిఫెస్టో( Manifesto )లో ఉచిత పథకాలను చేర్చి ప్రజలను మభ్య పెడుతుంటారని చెప్పారు.అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అంచనా వేయకుండా ఉచిత పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు