దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు ( Jamili elections )జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.“వన్ నేషన్ వన్ ఎలక్షన్” ( One Nation One Election )పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అవుతున్నట్లు గత కొద్ది నెలల నుండి ప్రచారం జరుగుతూ ఉంది.దేశంలో పార్లమెంటు నుంచి గ్రామపంచాయతీ స్థాయి వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తూ ఉంది.అయితే ఇందుకు గాని పది లక్షల కోట్లు ఖర్చు అవుతాయని సెంటర్ ఫర్ మీడియా సంస్థ స్పష్టం చేసింది.
సరిగ్గా అనీ రూల్స్ పాటించి…అనీ పార్టీలు సహకరిస్తే వారంలో కంప్లీట్ చేయగలిగితే ఇంకా తక్కువ ఖర్చుతోనే ఎన్నికలు కంప్లీట్ చేయొచ్చని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే దేశంలో జమిలి ఎన్నికలపై బీజీపీ నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావు( MP GVL Narasimha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికల ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.వీటి నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కమిటీ వేసి మార్గదర్శకాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదిక వచ్చాక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.పార్లమెంట్ లో జరగబోయే స్పెషల్ సమావేశాలలో జమిలి ఎన్నికలపై బిల్లు ఉంటుందో లేదో చెప్పలేమని.
స్పెషల్ స్పెషల్ లో స్పెషల్ ఎజెండా ఉంటుందని స్పష్టం చేశారు.








