Kishan Reddy : తెలంగాణ బడ్జెట్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( Telangana Assemmbly Budget Session ) జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తొలిసారి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో ప్రధాన హామీలు ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ 2,75,891 కోట్లతో తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటన చేశారు.ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) స్పందించడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంకెల గారి మాటల గారడి మాత్రమే ఉందని విమర్శించారు.గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్ లో ఎక్కువ పేజీలు కేటాయించారని అన్నారు.

ఎన్నికలలో వాగ్దానాల కోసం కేటాయింపులు లేవని కిషన్ రెడ్డి ఆరోపించారు.గత ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) చేస్తుందని వ్యాఖ్యానించారు.వ్యవసాయానికి ₹19,746 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు.

Advertisement

రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా లకి ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందని నిలదీశారు.సాగునీటి ప్రాజెక్టులకు 28 వేల కోట్లు సరిపోవని పేర్కొన్నారు.

అదేవిధంగా బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు కేటాయించి బీసీలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆరు గ్యారెంటీలలో రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అమలు కానట్టేనంటూ కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు