ఇటీవల ఫిబ్రవరి 8వ తారీఖు విడుదలైన “యాత్ర 2″( Yatra 2 ) సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే.వైసీపీ అధినేత సీఎం జగన్ జీవితంలో చోటు చేసుకున్న రాజకీయ విషయాలను ఆధారం చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) మరణించిన తర్వాత జగన్ ఏ రకంగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు వంటి విషయాలను ఆధారం చేసుకుని సినిమాని రూపొందించారు దర్శకుడు మహి వి రాఘవ్.కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావడం ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేయటం.
జగన్ జైలు పాలు కావటం వంటి విషయాలు కళ్ళకి కట్టినట్లు హృదయాన్ని హత్తుకునేలా తీశారు.ఈ సినిమాలో జగన్ పాత్రలో జీవ అధ్భుతంగా నటించడం జరిగింది.
2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర( YS Jagan Padaytara ) తర్వాత జగన్ ఎన్నికలలో గెలవడం ప్రమాణ స్వీకారం వంటి సీన్స్ వైసీపీ అభిమానులకు రోమాలు నిక్కబడుచుకునేలా చేశాయి.2019లో ఫిబ్రవరి 8వ తారీఖు “యాత్ర” సినిమా రిలీజ్ చేసిన రోజే ఈసారి 2024 ఎన్నికలకు ముందు “యాత్ర 2” విడుదల చేసి హిట్ అందుకోవడం జరిగింది.ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చాలామంది వైసీపీ నాయకులకు నచ్చింది.ఈ క్రమంలో తాజాగా వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) “యాత్ర 2” దర్శకుడు మహీ వి రాఘవ్ నీ కలిసి సత్కరించారు.మంచి సినిమాని అందించిన మహికి ధన్యవాదాలు అని ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేసి కామెంట్ పెట్టారు.“యాత్ర 2” రిలీజ్ అయిన రోజే మహి( Director Mahi V Raghav ) దర్శకత్వంలో ఈ సినిమా లో ఎమోషనల్ సన్నివేశాలు నా గుండెని పిండేసాయి అని ట్వీట్ చేశారు.కాగా శనివారం దర్శకుడు మహిని కలసి సత్కరించడం సంచలనంగా మారింది.