పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగడ.. ఏపీ రాజకీయాల్లో మార్పులు!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే నెలకొన్నట్లు అనిపిస్తోంది.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

రెండోసారి అధికారంలోకి రావడానికి జగన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.అలాగే మరోవైపు టీడీపీ కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నెలకొంది.ఆయా పార్టీల అధినేతలు అధికారంలోకి వచ్చేందుకు నూతన వ్యూహాలు పన్నుతున్నారు.

అయితే గుట్టుచప్పుడు కాకుండా అందరికీ షాకిచ్చింది మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణే.పవన్ కళ్యాణ్.

Advertisement

ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని పూర్తిగా మార్చేశారు.మొన్నటివరకు లైట్‌గా అనిపించినా.

ఇప్పుడు అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి.పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తున్న మార్పును చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.దీంతో ఊహించని స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఈ విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రం ఎప్పటికీ చీలనివ్వనని పార్టీ ఆవిర్భావ సభలో పేర్కొన్నారు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ మధ్య పొత్తు పొడుస్తుందనే వార్తలు ప్రచారం జరుగుతూనే వచ్చింది.వారం రోజుల క్రితం విశాఖపట్నం కేంద్రంగా, ఆ తర్వాత విజయవాడ వేదికగా కేవలం పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఆ దిశగానే రాజకీయ మలుపు తిరిగింది.

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనట్లు కనిపిస్తోంది.ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే విశాఖ సంఘటన జరగక ముందు ఒంటరిగానే పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ అనుకున్నారు.

తాజా వార్తలు