కీలక బిల్లు గట్టేక్కేనా..బిడెన్ వర్గంలో టెన్షన్ టెన్షన్..!!

అమెరికా కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడి పోయింది, ప్రతీ రోజూ వేలాది మంది అమెరికన్స్ కరోనా మహమ్మారికి ప్రభావంతో పిట్టల్లా రాలిపోయారు.

దాంతో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ నష్టనివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో అమెరికాలోని పలు కంపెనీలు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి.

ఈ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు, అలాగే తీవ్ర నష్ట్రాలలోకి వెళ్ళడంతో అమెరికన్స్ అందరూ ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ బ్రుతిపైనే ఆధారపడాల్సి వచ్చింది.ఈ పరిస్థితుల నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రతినిధుల సభలో రూ.1.90 వేల కోట్ల కోవిడ్ ప్యాకేజీ ని ప్రవేశపెట్టారు.బిడెన్ ప్రవేశ పెట్టిన ఈ భారీ ప్యాకేజీ ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది.

ఈ ప్యాకేజీ వలన కరోనా వలన తీవ్రంగా నష్టపోయిన వ్యాపార సంస్థలు, పలు కంపెనీ లు అలాగే ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్స్ కు ఊరట కలగనుంది.నష్టపోయిన వారందరికీ ఈ ప్యాకేజీ ద్వారా బిలియన్ డాలర్లు అందనున్నాయి.

ఇదిలాఉంటే ఈ బిల్లు ఆమోదం కోసం 219 మంది ఓట్లు వేయగా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా 212 మంది ఓట్లు వేశారు.సుదీర్ఘమైన చర్చల తరువాత ఈ బిల్లుకు ఆమోదం కలిగింది.

Advertisement

అయితే డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు జేర్డ్ గోల్డెన్ , కుర్ట్ లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఆమోదం పొందిన ఈ బిల్లులో సుమారు 50 బిలియన్ డాలర్లను కరోనా వ్యాక్సినేషన్ కు ఖర్చు చేస్తామని బిడెన్ గతంలోనే ప్రకటించారు.

ఇక ఏడాదికి లక్ష డాలర్లు సంపాదించే వారికి ప్రస్తుతం అలాంటి వారు ఎవరైతే నష్టాలలో ఉన్నారో వారి ఖాతాలలో దాదాపు 1400 డాలర్లు వేయనున్నారు.నిరుద్యోగులకు గతంలో ఇచ్చిన ప్యాకేజీకు అదనంగా మరో 400 డాలర్లు ఇవ్వనున్నారు.

అయితే ప్రతినిదుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు సెనేట్ లో ఆమోదం పొందాల్సి ఉందని.ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే సెనేట్ లో ఇరు పార్టీల బలాబలాలు 50-50 గా ఉన్నాయి.

ఒక వేళ డెమోక్రటిక్ పార్టీ తరుపున ఎవరైనా వ్యతిరేక ఓట్లు వేస్తె ఈ బిల్లు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు