Telangana Budget : లో కీలక కేటాయింపులు..!

తెలంగాణలో పాలన పరంగా కీలక మార్పులు చేర్పులు తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క( Finance Minister Bhatti ) అన్నారు.2024 బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

ఈ క్రమంలోనే పలు శాఖలకు కీలక కేటాయింపులు చేశారు.గృహాజ్యోతి( Gruhajyothi ) పథకానికి రూ.2,418 కోట్లు, ట్రాన్స్ కో, డిస్కంలకు రూ.16,825 కోట్లు , మూసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు , ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,740 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, నీటి పారుదల శాఖకు రూ.2,024 కోట్లతో పాటు రైతుబంధు( Rythu Bandhu ) నిబంధనలను పున: సమీక్షిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

అలాగే 2022-23 రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లు ఉండగా.ద్రవ్యలోటు( Fiscal Deficit ) రూ.32,557 కోట్లని ఆయన వెల్లడించారు.2023-24 మూలధన వ్యయం రూ.24,178 కోట్లు కాగా 2024-25 ఓటాన్ అకౌంట్ మొత్తం రూ.2 లక్షల 75,891 కోట్లు.2024-25 రెవెన్యూ వ్యయం అంచనా రూ.2 లక్షల 1 వేయి 178 కోట్లు 2024-25 మూలధన వ్యయం అంచనా రూ.29,669 కోట్లు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు