విజయవాడ కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా చేశారు.విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత తన రాజీనామా లేఖను మేయర్ భాగ్యలక్ష్మీకి అందజేశారు.
ఈ క్రమంలోనే కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని కేశినేని శ్వేత తెలిపారు.
ఈ క్రమంలోనే రాజీనామా ఆమోదించాలని మేయర్ ను కోరానన్నారు.ఆత్మగౌరవం లేని చోట పని చేయలేమని తెలిపారు.
కేశినేని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదన్న ఆమె కేశినేని భవన్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని చెప్పారు.క్యాడర్ తో చర్చించిన తరువాత కేశినేని నాని తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.