వీడియో: ఆహా ఏమి ఆ డ్యాన్స్.. కేరళ వధువు అదరగొట్టేసింది.. నెటిజన్లు ఫిదా

ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమాని డ్యాన్సులు వేసే వధూ వరుల వీడియోలు మన చెంతకు చేరుతున్నాయి.

ఈ వీడియోలను చూస్తుంటే ఇండియన్ మ్యారేజ్ ఎంత ట్రెండీగా మారి పోయిందో అవగత మవుతోంది.

వధువులు సిగ్గు, బిడియంతో తల దించుకొని తాళీ కట్టించుకునే రోజులు పోయాయని స్పష్టంగా తెలుస్తోంది.నేటి వధూవరులు తమ పెళ్లి రోజును మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.

ఇందుకోసం డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ తమ వెడ్డింగ్ డేని బ్యూటిఫుల్ గా మార్చుకుంటున్నారు.అలాగే తమ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ ఫిదా చేస్తున్నారు.

తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక కేరళ వధువు అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరినీ కట్టిపడేసింది.

Advertisement

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఓ వధువు తన పెళ్లి రోజున డ్యాన్స్ చేసింది.అత్రంగి రే చిత్రంలోని చకా చక్ అనే పాటకు ఈ వధువు స్టెప్పులేసింది.

ఈ ఒరిజినల్ పాటలో సారా అలీ ఖాన్ డ్యాన్స్ చేసింది.అయితే సారా కంటే ఈ వధువు చాలా గ్రేస్ ఫుల్ గా స్టెప్పులు వేసి అందరి హృదయాలను దోచేసింది.

వధువు పేరు రెంజితా ఆర్ నాయర్.ఈమె మరి కొందరితో కలిసి చకా చక్‌కి పాటకు ఆకట్టుకునే రీతిలో స్టెప్పులేసింది.

ఈ వధువు తన మెడలో బంగారు హారాలు ధరించింది.కొప్పులో ఆకర్షణీయమైన పూలు ధరించింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

పింక్ శారీ కట్టుకుంది.ఇలా ఆమె బ్రైడల్ లుక్ లో చాలా అందంగా కనిపించింది.

Advertisement

వధువు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ప్రతి బీట్‌కు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ, అద్భుతంగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది.అలా తన నాట్యాన్ని మళ్లీ మళ్లీ చూసేలా ఆమె అదరగొట్టింది.

ఈ వీడియోను ఫొటోగ్రాఫర్ జెరీ జాకబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఈ వీడియోలో వరుడు వధువు డ్యాన్స్ స్కిల్స్ చూస్తూ ఆమెకు దాసుడు అయి పోయినట్లుగా కనిపించింది.నెటిజనులు కూడా పెళ్లికూతురిని తెగ పొగిడేస్తున్నారు.

ఆహా ఏమి ఆ డ్యాన్స్ అదరగొట్టేసారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ బ్యూటిఫుల్ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

తాజా వార్తలు