ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పార్టీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ గత మూడు నెలల నుండి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను గుర్తించడానికి 500కు పైగా సోదాలు చేయడం జరిగిందని ట్విట్టర్ లో తెలియజేశారు.
ఇందుకోసం ఈడి, సీబీఐకి చెందిన అధికారులు 300 మంది దాడులలో పాల్గొంటున్నారని అన్నారు.దాదాపు కొన్ని రోజుల నుండి రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నారని స్పష్టం చేశారు.
బురద రాజకీయాల కోసం ఈ అధికారులంతా తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని విమర్శించారు.ఇలా అయితే దేశం ఎప్పుడు ప్రగతి సాధిస్తుందని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు.సరిగ్గా శుక్రవారం 35 చోట్ల పంజాబ్, హైదరాబాద్ రాష్ట్రాలలో ఈడీ సోదాలు చేస్తున్న సమయంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది.







