క్రేజీవాల్ ను చూసి చాలా నేర్చుకోవాలయ్యో

ఢిల్లీలో క్రేజివాల్ ముచ్చటగా మూడోసారి గెలవడం దేశవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా తీవ్ర స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది.

జాతీయ పార్టీ ని ఎదుర్కొని మరి సామాన్యుడి పార్టీ గా ఉన్న ఆమ్ ఆద్మీ ఢిల్లీ ఎన్నికల్లో గెలుపొందిన తీరు ఆశ్చర్యమే.

క్రేజీవాల్ గెలుపును ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.నిజంగా క్రేజీవాల్ గెలుపు ఒక సంచలనం.

ఎందుకంటే ఆయన గెలుపు కోసం పెద్దగా కష్టపడింది, హంగూ ఆర్భాటం చేసింది పెద్దగా ఏమి లేదు అనే చెప్పాలి.ఆయన ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి సామాన్య ప్రజలలో చెరగని ముద్ర వేయించుకున్నారు.

ఎక్కడా ఉచిత పథకాలు జోలికి వెళ్లకుండా నిజంగా ప్రజలకు ఏది అవసరమో ఏది అనవసరమో గుర్తించి ప్రజల నాడి పట్టుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాడు.పేదలు, మధ్య తరగతి ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారం పైన ఎక్కువగా దృష్టి సారించారు.తాను ప్రజలకు మంచి చేస్తున్నా అనే ఒక బలం ఆయన వెంట ఉండడం తోనే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ని సైతం ఎదుర్కొని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు.ముఖ్యంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.20 లీటర్ల స్వచ్ఛమైన తాగు నీటిని ఉచితంగా అందించారు.అలాగే 2013 ఎన్నికల్లో గెలవడానికి కారణమైన విద్యుత్తును కూడా ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా వినియోగించుకున్నారు.

Advertisement

విద్యుత్ తో పాటు పేద, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా రాయితీలను ప్రకటించారు.అలాగే ప్రతి గల్లీలో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటుచేసి ఉచిత వైద్యాన్ని పేదలకు అందించగలిగారు.దీంతోపాటు ప్రతి రోజు 500 మంది సామాన్య ప్రజలు తనను కలుసుకునేలా ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు.

ప్రజలు ముఖ్యమంత్రిగా క్రేజివాల్ పేరు సంపాదించుకున్నారు.మహిళలకు బస్సులో రాయితీ ప్రయాణం ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి.

అయితే ఎక్కడా ఉచిత పథకాలు, వ్యక్తిగత ప్రయోజనాల జోలికి వెళ్లకుండా నిరంతరం పేద ప్రజల కోసమే తాము పని చేస్తున్నాము అన్నట్టుగా ఆయన పనిచేసి ఈ ఎన్నికల్లో గెలుపొందారు.అదే క్రేజీవాల్ మూడోసారి గెలుపొందడానికి కూడా కారణం.

ఇప్పుడు ఆయన పార్టీ పాటించిన విధానాలను మిగతా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు కూడా పాటించి తిరుగులేని విజయం సాధించవచ్చు అని ఢిల్లీ ఎన్నికల ద్వారా నిరూపితం అవుతోంది.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు