డీ గ్లామర్ లుక్ లో మహానటి... పక్కనే సెల్వ రాఘవన్

సౌత్ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

ఈ ఏడాది అందరికంటే ఎక్కువ సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన హీరోయిన్ అంటే కీర్తి సురేష్ అని చెప్పాలి.

ఇప్పటికే కీర్తి సురేష్ నటించిన మూడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యాయి.అయితే ఈ మూడింటిలో ఒక్కటి కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

దీంతో కీర్తి సురేష్ కథల ఎంపికపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మహానటితో నేషనల్ అవార్డు నటిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కీర్తి సురేష్ మీద తెలుగు ప్రేక్షకులు చాలా ఎక్కువగా ఆశించడం మొదలు పెట్టారు.

అయితే వారి అంచనాలని అందుకోవడం కీర్తి సురేష్ నుంచి వచ్చి గత మూడు సినిమాలు పూర్తిగా విఫలం అయ్యాయి.గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ నుంచి ఇప్పటికే మరో సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

Advertisement

గుడ్ లక్ సఖీ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని ట్రయిలర్ బట్టి తెలిసిపోయింది.

ఇదిలా ఉంటే మరో వైపు నితిన్ కి జోడీగా చేసిన రంగ్ దే కూడా షూటింగ్ చివరిదశలో ఉంది.మరో వైపు కోలీవుడ్ లో అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సానికాయుధం అనే సినిమాలో కీర్తి సురేష్ మరో కీలక పాత్రలో నటించింది.ఇందులో సెల్వ కూడా నటించాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.ఇందులో కీర్తి సురేష్ పూర్తి డీగ్లామర్ పాత్రలో కనిపించింది.

ఆమె స్టిల్ కూడా దండుపాళ్యం తరహాలో పోలీస్ స్టేషన్ లో నేరస్థురాలు కూర్చున్నట్లు ఉంది.పక్కనే సెల్వ రాఘవన్ ఉన్నాడు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

ఇందులో ఆమె నెగిటివ్ పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.దారికాచి దోపిడీలు చేసే గ్యాంగ్ గా కీర్తి సురేష్, సెల్వ పాత్రలు ఉంటాయని సమాచారం.

Advertisement

ఇలాంటి విభిన్నమైన పాత్రలో నటిస్తున్న మహానటి ఎంత వరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు