మహానటి( Mahanati ) ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చింది.అంతే కాకుండా కీర్తి సురేష్ కి వెన్నెల పాత్ర తో మంచి పాపులారిటీ సొంతం అయ్యింది.
అందుకే కీర్తి సురేష్ టాలీవుడ్ లో వరుసగా సినిమా లు దక్కించుకోవడం ఖాయం.ముందు ముందు కీర్తి సురేష్ టాలీవుడ్ లో అమాంతం పెరగడం ఖాయం అనుకున్నారు అంతా.
కానీ సీన్ రివర్స్ అయ్యింది.సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) మరియు దసరా సినిమాలు రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కానీ ఇప్పటి వరకు కీర్తి సురేష్( Keerthy Suresh ) కి తెలుగు లో పెద్దగా ఆఫర్లు రాలేదు.అయినా కూడా స్టార్ హీరోయిన్ అంటూ పేరు తో కొనసాగుతోంది.టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు కీర్తి సురేష్ తో సినిమా అంటే ఆసక్తి చూపడం లేదట.ఎందుకంటే ఆమె కమర్షియల్ పాత్రలకు సెట్ అవ్వదు అనేది చాలా మంది అభిప్రాయం.
ముఖ్యంగా స్కిన్ షో చేస్తూ గ్లామర్ డాల్ గా కనిపించాలంటే కుదరదు అంటుందట.అందుకే ఈమెకు హీరోయిన్ గా తెలుగు లో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు.
అందుకే ఈ మద్య కాలంలో కీర్తి సురేష్ స్కిన్ షో( Keerthy Suresh Glamor Show ) కి ఓకే అన్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.ముందు ముందు కూడా తాను స్కిన్ షో చేస్తాను అన్నట్లుగా చెబుతోంది.

అందాల ఆరబోత విషయంలో కీర్తి సురేష్ గతంలో ఉన్న ఆలోచనతో ఇప్పుడు లేదు.అయినా కూడా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి అభిమానులు మాట్లాడుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.కారణం ఏంటి అంటే ఆమెను పద్దతైన మహానటి సావిత్రి పాత్రలో చూసి ఇప్పుడు డర్టీ బ్యూటీ పాత్ర లో చూడాలి అనుకోవడం లేదు.అందుకే ముందు ముందు అయినా ఆమె హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







