ఆ కంపెనీలకు షాకిచ్చిన బీసీసీఐ.. బిడ్ వేయకుండా నిషేధం

బీసీసీఐ( BCCI ) కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా జట్టుకు మొన్నటివరకు బైజూస్ లీడ్ స్పాన్సర్‌గా ఉండేది.

 Bcci, Which Shocked Those Companies, Banned Them From Bidding , Bcci, Companies,-TeluguStop.com

కానీ ఆ కంపెనీ లీడ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది.దీంతో కొత్త కంపెనీ కోసం బీసీసీఐ బిడ్డింగ్ ఆహ్వానిస్తోంది.

అయితే తాజాగా టూల్ కిట్ స్పాన్సర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.టూల్ కిట్ స్పాన్సర్( Tool Kit Sponsor ) గా ఆదిదాస్ కంపెనీని( Adidas company ) సెలక్ట్ చేసింది.

ఐదేళ్ల పాటు ఆ కంపెనీతో బీసీసీఐ డీల్ కుదర్చుకుంది.ఈ క్రమంలో ఇక లీడ్ రోల్ స్పాన్సర్ గా ఎక్కువకాలం ఉండే కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలని బీసీసీఐ చూస్తోంది.

Telugu Ban, Bcci, Byjus, Cricket, Latest, Sponsor-Sports News క్రీడల

తాజాగా లీడ్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ టెండర్ల కోసం అప్లై చేసుకున్నవారికి బిడ్ నిర్వహిస్తుంది.బిడ్ లో అర్హత సాధించినవారికి స్పాన్సర్‌షిప్ అవకాశం ఇవ్వనుంది.అర్హతలు ఉన్న కంపెనీలు, మిగతా నిబంధనలను పాటించే కంపెనీలకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది.ఐటీటీ కొనుగోలు చేస్తే బిడ్ వేయవచ్చని, బిడ్‌ కు అర్హత సాధిస్తారని అనుకుంటే పోరపాటే అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

Telugu Ban, Bcci, Byjus, Cricket, Latest, Sponsor-Sports News క్రీడల

అలాగే బిడ్ వేయడానికి కొన్ని కంపెనీలపై బీసీసీఐ నిషేధం విధించింది.స్పోర్ట్స్ వేర్ మ్యానుఫ్యాకర్ చేసే కంపెనీలతో పాటు ఆల్కహాల్ తయారుచేసే కంపెనీలు, బెట్టింగ్ కంపెనీలు, క్రిప్టో కరెన్సీ కంపెనీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమింగ్, రియల్ మనీ గేమింగ్ వేదికలు, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లు, పోర్నోగ్రఫీ వంటి అఫెన్సివ్ వంటి కంటెంట్ కు సంబంధించిన కంపెనీలు స్పాన్సర్‌షిప్‌కు అనర్హులని ప్రకటించింది.మరికొద్దిరోజుల్లో వెస్డిండీస్ టూర్ ఉండనుంది.

దీంతో వెస్డిండీస్ టూర్ కు ముందే స్పాన్సర్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.ఈ ఏడాదిలో వన్డే వరల్డ్ కప్ తో పాటు ఆసియా కప్ జరగనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube