ఈ ఫోటోలోని స్టార్ హీరోయిన్స్ ను గుర్తు పట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీలుగా నటించి కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శిన్ గుర్తింపును సంపాదించుకున్నారు.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్ తొలి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో పాటు ఆ తరువాత ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు.

హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ ఆ సినిమాతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈరోజు కళ్యాణి ప్రియదర్శన్ పుట్టినరోజు.

తెలుగులో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కళ్యాణి ప్రియదర్శన్ తమిళ, మలయాళ సినిమాల్లో మాత్రం నటిస్తున్నారు.కళ్యాణి పుట్టినరోజు సందర్భంగా కీర్తి సురేష్ అరుదైన ఫోటోను షేర్ చేశారు.

చిన్నప్పుడు కళ్యాణి, కీర్తి సురేష్ కలిసి ఒక ఫోటో దిగగా ఆ ఫోటోను కీర్తి సురేష్ షేర్ చేయడం గమనార్హం.ఈ ఫోటో ద్వారా కీర్తి, కళ్యాణి చిన్నప్పటి నుండే స్నేహితులని అర్థమవుతోంది.

Advertisement

ఇద్దరు హీరోయిన్ల తల్లిదండ్రులు సినీపరిశ్రమకే చెందిన వారనే సంగతి తెలిసిందే.కళ్యాణి ప్రియదర్శన్ కంటే కీర్తి సురేష్ వయస్సులో ఒక సంవత్సరం పెద్ద అని తెలుస్తోంది.కీర్తి, కళ్యాణి అరుదైన ఫోటోలను ఈ ఇద్దరు హీరోయిన్ల ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.

చిన్నప్పుడు ఒక పుట్టినరోజు వేడుకలో కీర్తి, కళ్యాణి ఈ ఫోటో దిగినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ భాషల్లోని ఆఫర్లతో బిజీగా ఉన్నారు.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీర్తి సురేష్ కు ఆఫర్లు వస్తున్నాయి.

ఆ సినిమాలు హిట్టైతే మాత్రం కీర్తి మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.కీర్తి గుడ్ లక్ సఖి మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

జూన్ లో ఈ మూవీ రిలీజ్ కానుందని సమాచారం.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు