టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ( keerthy suresh )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల కీర్తి సురేష్ ఒక వ్యక్తితో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక అప్పటి ఆమె ప్రేమలో పడింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు అని కీర్తి సురేష్ తెలిపిన విషయం తెలిసిందే.సోషల్ మీడియా( Social media )లో వినిపిస్తున్న వార్తలన్నీ కూడా ఒట్టి పుకార్లే అని తేల్చి చెప్పేసింది.

కాగా ఇటీవల ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి కూడా స్పందించిన విషయం తెలిసిందే.నా కూతురు కీర్తి ఒక అబ్బాయితో లవ్‌లో ఉందని.త్వరలో అతడ్ని పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అవన్నీ ఫేక్ న్యూస్.నాకు ఆ అబ్బాయి తెలుసు.
అతడి పేరు ఫర్హాన్.అతడు మా కుటుంబ స్నేహితుడు.
ఫర్హాన్ పుట్టిన రోజున కీర్తి కొన్ని ఫొటోలను షేర్ చేసింది.వాటిని చూసి మీడియా తప్పుడు వార్తలు రాసింది అని తెలిపింది.
ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది.కీర్తి సురేష్ తమిళంలో మామన్నన్ చిత్రంలో నటించింది.
ఇందులో ఉదయనిధి స్టాలిన్( Udhayanidhi Stalin ) హీరోగా నటించారు.

తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తికి మరోసారి పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని ప్రశ్నించగా.ఆ వార్తలపై కీర్తి సురేష్ స్పందిస్తూ.నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను.మీరంతా నా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు ?నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు? నా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాక నేనే స్వయంగా ప్రకటిస్తాను.దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు.
ఇక ప్రతిసారి ప్రెస్ మీట్ లో ఇలాంటి ప్రశ్నలు వద్దు అంటూ సీరియస్ అయ్యింది.