బడా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్( Elon Musk ) ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో పెను మార్పులే వచ్చాయని చెప్పుకోవచ్చు.మస్క్ అత్యంత కీలకమైన ఫీచర్లను పెయిడ్ ఫీచర్లుగా మార్చి, ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారని విషయం అందరికీ తెలిసినదే.
ఈ క్రమంలోనే తాజాగా మరో సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రీమియం ఫీచర్‌గా మార్చేసింది.మార్చి 20 నుంచి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్( Twitter Blue Subscription ) తీసుకున్న వారికి తప్ప, మిగతా వారందరికీ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ట్విట్టర్ ఆపేసింది.
ఇప్పుడు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకొని పక్షంలో.మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడాల్సిందే తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.

ఇండియాలో మొబైల్ యూజర్లకు ట్విట్టర్ బ్లూ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఏకంగా రూ.900గా నిర్ణయించిన సంగతి విదితమే.అయితే నెలకు ఇంత డబ్బు పెట్టడం ఎవరికీ ఇష్టంలేదు.పైగా చాలా మంది యూజర్లు అది చాలా భామ అని చెబుతున్నారు.ఈ క్రమంలోనే చాలామంది ట్విట్టర్ నుండి అవుట్ అయ్యారు.అదేవిధంగా కీలకమైన ప్రైవసీ ఫీచర్లను సైతం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో భాగం చేయడం పట్ల యూజర్లు అసంతృప్తితో వున్నారు.
అయితే థర్డ్ పార్టీ యాప్స్‌తోనూ ట్విట్టర్ అకౌంట్‌ను సేఫ్టీగా ఉంచుకోవచ్చని కొంతమంది చెబుతున్నారు.

మరి థర్డ్ పార్టీ యాప్స్( Third Party Apps ) ఏవి, వాటిని వాడుకొని సెక్యూరిటీని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.ట్విట్టర్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం ట్విట్టర్ (SMS) మెస్సేజ్ బేస్ట్ పద్ధతి కాకుండా సెక్యూరిటీ కీ, అథెంటికేటర్ యాప్ అనే మరో రెండు పద్ధతులను అందిస్తుంది.సాధారణ యూజర్లు ఈ పద్ధతుల్లో ఒకదానిని ఉపయోగించవచ్చు.
ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసి, ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’( ‘Settings and Privacy’ )లోకి వెళ్లి తర్వాత ‘సెక్యూరిటీ అండ్ అకౌంట్ యాక్సెస్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.దీంట్లో కనిపించే ‘సెక్యూరిటీ’పై క్లిక్ చేయాలి.
అక్కడ ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ సెలక్ట్ చేసుకోవాలి.అనంతరం స్క్రీన్‌పై కనిపించే ‘అథెంటికేషన్ యాప్’ ఆప్షన్ ఎంచుకొని ప్రాసెస్ చేస్తే సరిపోతుంది.







