కే‌సి‌ఆర్ అస్త్రాలు కుప్పలు కుప్పలుగా..?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు సిద్దమౌతున్నాయి.

ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్( BRS party ) అందరి కంటే ముందే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించి రేస్ లో ఒక్క అడుగు ముందే ఉంది.

ప్రజలను ఆకర్షించడంలోనూ, ఎన్నికల వేళ అందరి దృష్టి పార్టీ పై ఉంచడంలోనూ కే‌సి‌ఆర్ రూటే సపరేటు.సరైన ఎన్నికల ప్రణాళికలతో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తుంటారు గులాబీ బాస్.

ఇక ఈసారి కూడా పక్కా వ్యూహాత్మకంగా గెలుపే లక్ష్యంగా అస్త్రాలకు పదును పెడుతున్నారు కే‌సి‌ఆర్( CM KCR )ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితా అభ్యర్థులలో దాదాపు సిట్టింగ్ లకే అధిక స్థానాలు కేటాయించి ఆశ్చర్యపరిచారు.

ఇక ఇప్పుడు ప్రజలను ఆకర్శించేందుకు అమలు చేయబోయే హామీలపై ఫోకస్ పెట్టారు.ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు( Welfare schemes ) అమలు చేస్తుండగా.మరో రెండు కొత్త పథకాలను అమలు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారట.

Advertisement

ఈసారి బీసీలను మరియు మహిళలను లక్ష్యంగా చేసుకొని ఆ పథకాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఆ పథకాల అమలుకు సంబంధించి ఇప్పటికే ఆన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం అమలు చేయబోయే పథకాలతో పాటు త్వరలో ప్రకటించబోయే మేనిఫెస్టోలో మరికొన్ని సరికొత్త పథకాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఈ మూడు నెలల్లో రాష్ట్రమంతా బి‌ఆర్‌ఎస్ నామజపం చేసేలా కే‌సి‌ఆర్ పక్కా వ్యూహాలను సిద్దం చేసుకున్నాట్లు పోలిటికల్ ఇన్ సైడ్ టాక్.ఇక ఈ విధంగా పార్టీ బలోపేతంతో పాటు ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసేలా కూడా కే‌సి‌ఆర్ వ్యూహాలు ఉండబోతున్నాయట.మరి హ్యాట్రిక్ పై గట్టిగా దృష్టి పెట్టిన గులాబీబాస్.

తన పోలిటికల్ స్ట్రాటజీలతో మరోసారి బి‌ఆర్‌ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తారా అనేది చూడాలి.అదే విధంగా ఈసారి 100కు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన.అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా అనేది చూడాలి.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??
Advertisement

తాజా వార్తలు