ఎన్నికలు అయిపోతే కేసీఆర్ ఇళ్లు ఇవ్వరు..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమం కొనసాగుతోంది.

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న బీజేపీ మహాధర్నా కేంద్రమంత్రి, రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేస్తుంది.అయితే హైదరాబాద్ లో పది లక్షల మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారన్న కిషన్ రెడ్డి ఎన్నికలు అయిపోతే సీఎం ఇళ్లు ఇవ్వరని చెప్పారు.42 బస్తీల్లో శిలాఫలకాలు వేశారన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు.

నాలుగు నెలల తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌజ్ కు వెళ్తుందని జోస్యం చెప్పారు.ఇళ్ల విషయంలో పేదలకు మంచి జరిగేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు