మాజీ ఐపీఎస్ తో కేసీఆర్ కు కొత్త చిక్కులు ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.వాస్తవంగా ప్రవీణ్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారని, అందుకే అకస్మాత్తుగా తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసారని ప్రచారం జరిగింది.

 Kcr Troubled On Ex Ips Praveen Kumar Comments Kcr, Trs Government, Ktr, Ips Prav-TeluguStop.com

అయితే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.అలాగే ఏ పార్టీలో చేరడం లేదని చెప్పారు.

అయితే ఆయన ఇప్పుడు నేరుగా టీఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం పెద్ద తలనొప్పిగా మారింది.ఇప్పటికే హుజురాబాద్ లో దళితుల ఓట్ల కోసం కేసీఆర్ ఎన్నో రకాలుగా తంటాలు పడుతున్నారు.

వారి కోసం కొత్త కొత్త స్కీములు పెడుతూ, నియోజకవర్గానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే అదే దళిత వర్గాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆ అంశాలపైనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంతో ఇప్పటి వరకు వచ్చిన క్రెడిట్ అంతా ప్రవీణ్ విమర్శలతో పోతుందనే భయం టిఆర్ఎస్ పెద్దల్లో నెలకొంది.

అసలు కెసిఆర్ పై ఉన్న కోపంతోనే ప్రవీణ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్టుగానే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రెండు రోజుల్లోనే ఆయన పై కరీంనగర్ లో మత విధ్వంసాలు సృష్టిస్తున్నారనే కేసు నమోదయింది.

దీనిపై ప్రవీణ్ ఘాటుగానే స్పందిస్తున్నారు.తనపై కేసు పెట్టడాన్ని ప్రవీణ్ జనాల్లోకి తీసుకెళ్లి టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే విధంగానే వ్యవహరిస్తున్నారు.

Telugu Dalitha Bandu, Hujurabad, Swero, Trs-Telugu Political News

అలాగే దళిత బంధు పథకం పైన, హుజురాబాద్ లో వారికి ఇస్తున్న ప్రాధాన్యం పైన ప్రవీణ్ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.దళిత ముఖ్యమంత్రి అని గతంలో ప్రకటించి, ప్రజలతో ఓటు వేయించుకుని మోసం చేశారని, మళ్లీ ఇప్పుడు అదే విధంగా మోసం చేస్తారని, అటువంటి ఛాన్స్ ఇవ్వొద్దు అంటూ ప్రవీణ్ ప్రజలకు పిలుపునిస్తున్నారు.హుజురాబాద్ లో ఉన్న దళితులకు వెయ్యి కోట్లు అంటున్నారని, అవే వెయ్యి కోట్లు గురుకుల కోసం ఖర్చు పెడితే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని ప్రవీణ్ విమర్శలు చేస్తున్నారు.అలాగే ప్రభుత్వంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేల వల్ల ఆ వర్గాలకు ఎటువంటి ఉపయోగం లేదని, ఇప్పుడు కేసీఆర్ కు అకస్మాత్తుగా దళితులపై ప్రేమ కురిపించడానికి కారణం త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఎన్నికలే అంటూ ఆయన విమర్శలు చేస్తుండడంతో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ లో ఆందోళన నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube