కేసీఆర్ సంచలన నిర్ణయం..!!!

తెలంగాణా అసెంబ్లీ అన్నికల్లో ఊహించని రీతిలో విజయాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.ఆ దూకుడు ని పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కొనసాగించానున్నారని తెలుస్తోంది.

 Kcr To Participate In Mp Election For The Year 2019-TeluguStop.com

ఈ సారి ఎలాగైనా సరే గతంలో కంటే కూడా అత్యధిక స్థానాలని సాధించాలని పట్టుదలతో ఉన్నారు కేసీఆర్.ఇదిలాఉంటే ఈ సారి పోటీ చేయబోయే అభ్యర్ధుల విషయంలో కేసీఆర్ రెండు స్థానాలలో మార్పులు చేర్పులు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సంవత్సరం మార్చి నెలలో రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం కేసీఆర్ తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మహబూబ్ నగర్ స్థానం నుంచీ ఎంపీ జితేందర్ రెడ్డి స్థానంలో మరోకరిని బరిలోకి దింపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.ఇదిలాఉంటే ఖమ్మం నుంచీ కూడా మార్పులు ఉండవచ్చునని వచ్చిన అనేక ఊహాగానాలకి కేసీఆర్ చెక్ శుభం కార్డు వేశారు.ఈ స్థానం నుంచీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కే పార్టీ టిక్కెట్టు ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలాఉంటే

కరీంనగర్ నుంచీ కాని లేదా నల్గొండ నుంచీ కాని కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.ఈ రెండు స్థానాల్లో కేసీఆర్ ఎక్కడి నుంచీ పోటీ చేస్తారు అనేది మాత్రం క్లారిటీ లేకపోయినా పార్లెమెంటు కి వెళ్ళడం మాత్రం పక్కా అనే టాక్ వినిపిస్తోంది.

మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డి కి బదులుగా ఓ మాజీ మంత్రి బరిలో దిగానున్నారని టాక్ విన్పిస్తోంది.చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ సారి తాండూరు నుండి ఓటమి పాలైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కి అవకాసం దక్కేలా ఉందని తెలుస్తోంది.

పెద్దపల్లి స్థానం నుంచీ వివేక్ బరిలో దిగనుండగా, కరీంనగర్ నుంచీ కేసీఆర్ బరిలో దిగితే ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న ఎంపీ వినోద్ ఎక్కడి నుంచీ పోటీ చేస్తారు అనే విషయంపై పార్టీలో ఇంకా చర్చల్లో ఉందని అంటున్నారు.

నల్గొండ నుండి కేసీఆర్ పోటీ చేయాలనీ అనుకుంటే గుత్తా ని ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలోకి తీసుకోవాలనేది కేసీఆర్ ప్లాన్.మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం నుంచీ గతంలో ఎంపీగా పోటీ చేసిన మల్లా రెడ్డి బరిలో దిగగా ఆయన విజయం సాధించారు.అయితే ఈ సారి ఈ ఎంపీ స్థానం ఎవరికీ దక్కుతుందో అనే చర్చ జరుగుతోంది.

అయితే ఈ మార్పులు చేర్పులు జనవరి చివరి వారంలోగా తేల్చేసి అభ్యర్ధులని ప్రకటించాలనేది కేసీఆర్ వ్యూహం.ఈలోగా ఇంకెన్ని మార్పులు జరుగుతాయో వేచి చూడాలి అంటున్నారు పార్టీ నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube