ఈ టికెట్ల గోల ఏంటి...? తన్నుకుంటూ తిట్టుకుంటూ...

ప్రస్తుతం రాజకీయాలన్నీ పదవుల చుట్టూ.డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి.

అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు మేము కేవలం ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయడానికి.మా పార్టీని ఉద్దరించడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చామంటే నమ్మే పరిస్థితి లేదు.

ఎందుకంటే రాజకీయాలన్నీ.పదవుల చుట్టూనే తిరుగుతాయి.

పదవి ఉంటేనే నాయకుడికి గౌరవం.ఆ పదవుల కోసమే పార్టీల్లో ఉన్న నాయకులంతా ఆరాటపడుతుంటారు.

Advertisement

ఇక ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే.ఎన్నికలకు సమయం ఎంతో లేదు.

ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీల్లో చర్చ అంతా.టికెట్ల మీదే.

వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా టికెట్ సంపాదించి ఎమ్యెల్యే అయిపోవాలని ప్రతి నియోజకవర్గంలోనూ .ప్రతి పార్టీలోనూ నలుగురైదుగురు నాయకులు తేరా చాటు ప్రయత్నాలు చేస్తూ.ఈ దశలో పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు.

ముఖ్యంగా ఈ టికెట్ల పంచాయతీ.టీడీపీలో ఎక్కువ కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో ఖర్చుపెట్టే అవకాశం ఉండడంతో ఎక్కువమంది టీడీపీ సీటు సంపాదించాలని తాపత్రయపడుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అయితే.టికెట్ల విషయంలో .ఇటు నాయకులు కానీ, అటు చంద్రబాబు కానీ.టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని అంటున్నా.

Advertisement

లోలోపల మాత్రం సెగలు పుట్టిస్తూనే ఉంది.ఆ జిల్లా ఈ జిల్లా అనే పరిస్థితి లేకుండా నాయకులు టికెట్ల కోసం బాగానే పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో .టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా జరుగుతోంది.టికెట్లు ఆశిస్తున్న టీడీపీ నేతల్లోనే చీలికలు వచ్చాయి.

నాకంటే ముందు ఎవరూ ఉండకూడదు అనే రేంజ్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు.

నాయకులు ఎక్కడికక్కడ టికెట్లు తమకంటే తమకేనని చెప్పుకోవడం కాదు, వాటి కోసం ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.అదే సమయంలో కేడర్ ను కూడా తమ అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అయితే, ఈ విషయం స్థానిక నాయకులు రెండుగా చీలిపోయి పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకువచ్చారు.ఈ తలనొప్పులు కొంతమేర తగ్గించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ పార్టీలో ముఖ్య నాయకులకు సీరియస్ గా వార్ణింగ్ లు ఇస్తున్న పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు.

టికెట్ వస్తేనే పార్టీలో ఉంటామని, లేకుంటే.వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనకాడబోమని సీరియస్ వార్ణింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు.

జనవరిలోనే టికెట్ల ప్రకటన చేద్దామని ఆలోచిస్తున్న బాబు కి ఈ టికెట్ల పంచాయతీ పెద్ద తలనొప్పిగా మారింది.ఆయా నిజోజకవర్గాల్లో టికెట్లు ఆశించే నేతలు ఇబ్బడి ముబ్బడిగా ఉండడంతో.

నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ.కుమ్ములాటలకు సైతం దిగుతున్నారు.

తాజా వార్తలు