హలో... నేను కేసీఆర్ ని మాట్లాడుతున్నా..!

కెసిఆర్ అంటే ఏదీ ఆషామాషీగా ఉండదు.ఆయన ఏం చేసినా , దానికి ఒక లెక్క పక్కాగా ఉంటుంది.

ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం పై కెసిఆర్ దృష్టి పెట్టారు.ప్రభుత్వ పథకాలకు వేల కోట్లు అయినా, ఈ నియోజకవర్గంలో రాజేందర్ పై పట్టు సాధించాలని,  టిఆర్ఎస్ అభ్యర్థికి ఇక్కడ గెలుపు దక్కితేనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, లేకపోతే టిఆర్ఎస్ విజయం అనుమానంగానే ఉంటుంది అనే భయం కెసిఆర్ లో ఉంది.

అందుకే ఏదో రకంగా నియోజకవర్గంలో రాజేందర్ ను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ నియోజకవర్గానికి ఇంచార్జీలు గా నియమించి,  రాజేందర్ ప్రధాన అనుచరులు అందరికీ కీలక పదవులు ఇవ్వడంతోపాటు , అనేక రకాలుగా ప్రలోభ పెట్టి మరి టీఆర్ఎస్ వైపు తీసుకు వస్తున్నారు.

  దీంతో పాటు భారీ ఎత్తున సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గం నుంచి అమలు చేస్తూ, ఈ నియోజకవర్గ ప్రజల్లో పట్టు చేజారకుండా చూసుకుంటున్నారు.అంతే కాదు దాదాపు నాలుగు వేల మందికి పైగా దళితులు ఈ నియోజకవర్గంలో ఉండడంతో, దళిత బంధు పథకానికి ఏ నియోజకవర్గం నుంచి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.

Advertisement

దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే ఈ నెల 26న కెసిఆర్ ఈ నియోజకవర్గంలో దళితులతో సమావేశం కానున్నారు  ఈ సమావేశానికి ఈ నియోజకవర్గంలోని గ్రామాల నుంచి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు చొప్పున మొత్తం 427 మందిని ఎంపిక చేసి, ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు.

అంతేకాదు స్వయంగా కొంతమంది నేతలకు కేసీఆర్ ఫోన్ చేసి ఆహ్వానిస్తూ ఉండటం వైరల్ గా మారింది.  తాజాగా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన కార్యకర్త , ప్రస్తుత ఎంపీటీసీ భర్త వాసాల రామస్వామి తో కేసిఆర్ ఫోన్ లో మాట్లాడారు.జూలై 26న మండల కేంద్రాల్లో సమావేశమై ప్రత్యేక బస్సులో హుజురాబాద్ కు రావాలని , అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి హైదరాబాద్ కు రావాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు.

  " దళిత జాతి భవిష్యత్తు దళిత బంధువుడు పై ఆధారపడి ఉంది.కాబట్టి స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లాలి.హుజూరాబాద్ నియోజకవర్గం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తాం.

అంటూ కెసిఆర్ సదరు నాయకుడు తో మాట్లాడారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ సందర్భంగా సదరు నాయకుడు రామస్వామి ఈటెల రాజేందర్ కారణంగా తాను ఎంతగా ఇబ్బంది పడ్డాను అనే విషయాన్ని ప్రస్తావించగా,  రాజేందర్ చిన్నోడు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కెసిఆర్ చెప్పారు.ఇదేవిధంగా మరికొంతమంది కీలక నాయకులకు స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించాలని,  ఈ నియోజకవర్గంలో కీలక నాయకులు అనుకున్న వారందరికీ ఫోన్ లు చేస్తూ, ఇదే రకమైన వ్యూహంతో ముందుకు వెళ్తే, ఖచ్చితంగా గెలుపు తమ ఖాతాలో పడుతుంది అనే లెక్కల్లో కెసిఆర్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు