జానా గెలవకుండా టీఆర్ఎస్ వేస్తున్న వ్యూహం ఇదే?

నాగార్జున సాగర్ నియోజక వర్గం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్.

ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఆ స్థానం ఖాళీ కావడంతో త్వరలో ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది.

అయితే అక్కడ బీజేపీకి పెద్దగా బలం లేదు సరికదా.ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి అసలు క్యాడర్ లేదు.

అంతేకాక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం బీజేపీని కొంత దెబ్బ తీసిందనే చెప్పవచ్చు.కావున అక్కడ టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య రసవత్తర పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ఇప్పటికే 7 సార్లు గెలిచిన అనుభవం ఉన్న జానారెడ్డితో ఢీ కొట్టాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.ఎందుకంటే జానారెడ్డి అనుభవం అంత వయస్సు ఉండదు.

Advertisement

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు.అయితే జానారెడ్డిని ఓడించడానికి ఒక పకడ్భంధీ వ్యూహాన్ని అమలు చేస్తోంది.జానా రెడ్డి ఏమీ చేయలేదనే ఒక భావన ప్రజల్లో బలంగా నాటుతూనే, టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు వల్ల నాగార్జున సాగర్ కు కలిగే లాభం ఇదే అని ప్రజల్లోకి ఒక స్పష్టత తీసుకొచ్చే పనిలో పడ్డారు టీఆర్ఎస్ నేతలు.

ఇక ప్రజల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ టీఆర్ఎస్ ను గెలిపిస్తే జరిగే మంచి పనులు ఏంటివి అని కూడా కూలంకుశంగా వివరిస్తున్నారు.అయితే ఇంత ప్రచారం చేయడం ద్వారా జానా మాటలను పట్టించుకునే పరిస్థితి ఉండొద్దు అనేది టీఆర్ఎస్ వ్యూహం.

Advertisement

తాజా వార్తలు