ప్రతిపక్షాల విమర్శల పట్ల కేసీఆర్ మౌనం...అసలు వ్యూహం ఇదేనా

తెలంగాణ రాజకీయం రోజు రోజుకు అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున వేడెక్కిన పరిస్థితి ఉంది.అయితే ఇక రోజు రోజుకు ప్రతిపక్షాలు కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.

 Kcr Silence On Opposition Criticism Is This The Real Strategy, Kcr, Trs Party, T-TeluguStop.com

అయితే ప్రతిపక్షాలు ఇంతగా విమర్శలు గుప్పిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసలు స్పందించని పరిస్థితి ఉంది.అయితే ప్రజల్లోకి ఎంతలా వ్యతిరేకతను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న అంతగా ప్రతిపక్షాల వ్యూహాలు ఫలించడం లేదు.

అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ సంక్షేమ పధకాల పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేకపోవడమే.అయితే ఎందుకు కేసీఆర్ స్పందించడం లేదనేది ఇప్పుడు అందరికి తొలుస్తున్న ప్రశ్న.

అయితే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించి ప్రభుత్వ దృష్టిని మరల్చాలనేది ప్రతిపక్షాల వ్యూహం.అలా చేయడం ద్వారా మెరుగైన పాలనతో పాటు పాలనలో ఉన్నలోపాలను సవరించుకునే అవకాశం అదే విధంగా లోపాలను సవరించుకునే సమయాన్ని ప్రతిపక్షాలను విమర్శించడంపై కేటాయిస్తే ఇక మరింతగా టీఆర్ఎస్ పార్టీ కు ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

అందుకే ఎన్నికల సమయం దగ్గర పడ్డాక మాత్రమే ప్రతిపక్షాల విమర్శలపై స్పందించే అవకాశం కనిపిస్తోంది.అయితే ప్రతిపక్షాలు మాత్రం విమర్శల జోరు మాత్రం తగ్గించడం లేదు.కెసీఆర్ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం అనేదే జరుగుతున్నదనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి నేడు నెలకొంది.అదే విధంగా డబుల్ ఇంజన్ గ్రోత్ అనే పదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెల్లడమే కాకుండా ఈ డబుల్ ఇంజన్ గ్రోత్ అనే దానిపై టీఆర్ఎస్ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా  మఖ్యమంత్రి కెసీఆర్ ఒకవేళ స్పందించినా మరో సెన్సేషన్ అయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube