కేసీఆర్‎ను గద్దె దించాలి..: రాహుల్ గాంధీ

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విజయభేరీ సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.కేసీఆర్ రాజులా పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.ముఖ్య శాఖలు అన్నీ కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు.

రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.

ధరణి పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారన్న రాహుల్ గాంధీ ధరణి వలన సుమారు ఇరవై లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు.ఈ క్రమంలో కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు.

Advertisement

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు