కేసీఆర్ తిట్లే కూటమికి బలంగా మారబోతోందా ..?

రాజకీయాల్లో అవకాశం కుదరలే కానీ ఎలాంటి ప్రతికూల అంశాన్నైనా అనుకూలంగా మార్చుకోవచ్చు.ఇప్పుడు అలంటి పనే మహా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది.

 Kcr Scoldings Goes Benefit To The Maha Kootamani-TeluguStop.com

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా తమ ప్రత్యర్థి పార్టీల మీద తిట్ల పురాణం మొదలెట్టడంతో మొదట్లో ఆత్మరక్షణలో పడిన కూటమిలోని పార్టీలు ఆ తరువాత ఆ తిట్లనే అడ్డంపెట్టుకుని రాజకీయంగా పై చేయి సాధించాలని చూస్తున్నాయి.

నిజామాబాద్‌, నల్గొండ, వనపర్తి సభల్లో కాంగ్రెస్ పై తీవ్రమైన విమర్శలు చేశారు కేసీఆర్.తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ అంటూ… పనిలోపనిగా టీడీపీ మీద, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే, ఈ విమర్శల విషయమై కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆసక్తికరమైన విశ్లేషణ జరుగుతూ ఉండటం విశేషం! తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కి ఎందుకు అంటూ విమర్శలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రిప్లై ఇచ్చాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా, ఆంధ్ర ప్రాంత నేతలపైనా కేసీఆర్ విమర్శలు పెంచడం వల్ల.సీమాంధ్ర ప్రాంత సెటిలర్ల మహాకూటమికి దగ్గరవుతుందనే ఆలోచనలో టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి.

కేసీఆర్ విమర్శలను సీమాంధ్ర సెటిలర్స్ లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది.దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహం కూడా సిద్ధమౌతోందట! దీనికి ప్రధానంగా సోషల్ మీడియాను వేదికగా మార్చుకోవాలని చూస్తున్నారట! కేసీఆర్ కి అవసరం అనుకుంటే.ఆంధ్రాకి వెళ్తారనీ, అక్కడి ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారనీ.ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రులు దోపిడీ దారులు అంటున్నారనే అంశాన్ని ప్రచారం చేస్తారట.అలాగే ఆ మధ్య అనంతపురం పర్యటన సందర్భంగా సీమాంధ్ర నేతలతో చనువుగా వ్యవహరించడం, టెక్ మహీంధ్ర వంటి సదస్సుల్లో హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఉందని కేటీఆర్ మెచ్చుకోవడం ఇలాంటి వాఖ్యలన్నిటిని హైలెట్ చేసి కేసీఆర్ పరువు తీయాలని కూటమి పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube