KCR Vijaya Bhaskar Reddy : ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వన్స్ మోర్ ?

తెలుగు రాష్ట్రాల్లో ముందుస్తు ఎన్నికల మేఘం ముసురే అవకాశాలు కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది .

తాజాగా తెలంగాణ , ఆంధ్రలో ప్రభుత్వాల వైఖరి , రాజకీయ పరిణామాలు మరో ముందస్తు ముచ్చటకు దారి తీసే పరిస్ధితులను కొట్టిపడేయలేం అంటున్నారు పొలిటికల్ పెద్దలు .

ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎన్నడు లేని విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను పరుగుపెట్టించడంతో పాటు , పార్టీ వ్యవహరాలపై మరింత దూకుడు ప్రదర్శించడంతో ముందస్తు ముచ్చటపై బలమైన ప్రచారం జరుగుతుంది .మరోవైపు ఆంధ్రలో కూడా ఒకవైపు వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు , నాలుగు నెలల నుండి పార్టీ కార్యక్రమాలుపై ఒక్కసారిగా ఫోకస్ చేయడంతో పార్టీ వర్గాలతో పాటు బయట ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తోంది .ఐదు సంవత్సరాల పాటు పరిపాలించమని ప్రజాస్వామ్యంలోని ఎన్నికల వ్యవస్ధ రాజకీయ పార్టీలకు అవకాశమిస్తే…బలమైన , సహేతుకమైన కారణాలు లేకుండా అంతర్గతంగా రాజకీయ పరమైన అంశాలతోనే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా అధికార పార్టీలు ముందస్తుకు వెళితే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్లే అవుతుంది .తమ గడువుకాలాన్ని పరిత్యజించి ముందస్తుకు వచ్చే అధికార పార్టీలు తమ నైతికతను ప్రశ్నించుకోవల్సిన సందర్భమైతే…ఒకవేళ బలమైన సహేతుకమైన కారణాలతో అధికార పార్టీలు గడువుకి ముందే ఎన్నికలకు వెళితే దానికి దారితీసిన పరిస్థితులను అన్ని పక్షాలకు వివరించాల్సిన ,విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా నైతికంగా ఉంది .అటు కేంద్రంలోని అధికార పార్టీలకు గానీ , తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ముందస్తు ముచ్చట ప్రతిసారి మెరుగైన ఫలితాలనిచ్చిందా? లేక ఆ ప్రయోగం వికటించిందా అంటే చాలా వరకు ఎదురుదెబ్బలే తగిలాయని చెప్పవచ్చు .ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకోవడానికి 1983లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లి ఘోర ఓటమిని మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ .ఈ ఎన్నికల్లో టీడీపీ 202 అసెంబ్లీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.ఐతే నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తో యేడాదన్నర కాలంలోనే బలమైన సహేతుకమైన కారణం చూపి ఎన్నికల వెళ్లిన ఎన్టీఆర్ మళ్లీ ఘన విజయం సాధించారు.

అదే ఎన్టీఆర్ 1989లో నాలుగు నెలల గడువుకాలం ఉండగానే లోక్ సభ ఎన్నికలు రావడంతో జమిలీ ఎన్నికలకు మొగ్గు చూపి కేవలం 74 అసెంబ్లీ స్థానాలు ,రెండు ఎంపీ స్ధానాలా మాత్రమే పరిమితమయ్యారు .రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎన్టీఆర్ పోటీచేసి కల్వకుర్తిలో ఓటమిని మూటకట్టుకున్నారు.2003లో అలిపిరిలో జరిగిన ఘటనతో సానుభూతి కలిసివస్తుందని అంచనా వేసుకున్న చంద్రబాబు అటు వాజ్ పేయి నేతృత్వంలో కేంద్రాన్ని కూడా 2004 లో ముందస్తు ముగ్గులోకి దింపి పరాజయం పాలయ్యారు.అటు కేంద్రంలో బీజేపీ కూడా ఓటమి పాలయ్యింది.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల గడువుకు ముందే 2018లో ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు .పై ఫలితాలను విశ్లేషించి చూస్తే చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు వాస్తవమైన సహేతుకమైన కారణాలు చూపి ప్రజల్లోకి ఆ ఎన్నికల యొక్క ఆవశ్యకత బలంగా ప్రజల్లో చూపించగలిగినపుడే విజయతీరం వైపు మరోసారి చేరుకుంటున్నాయి.ఆ సమయాల్లో సరైన ముందస్తు వ్యూహలు లేని, మొదటి నుండి ప్రజలతో మమేకం కాని ప్రతిపక్షపార్టీలు తిరిగి అదే స్థానానికి పరిమితం అయ్యే పరిస్థితి కనిపించింది.

Advertisement
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

తాజా వార్తలు