తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ( BRS )పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్నో అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుతిన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్ లోని( karimanagar ) ఈ ఎన్ గార్డెన్ లో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుల సమావేశంలో పాల్గొన్నటువంటి బండి సంజయ్ ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రాబోవు లోక్ సభ ఎలక్షన్స్ లో పార్టీ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపై బండి సంజయ్ వారికి వివరించారు.అంతేకాకుండా వికాసిత్ భారత్ సంకల్పయాత్ర(Viksit Bharat Sankalp Yatra ) ఉద్దేశాలను కూడా తెలియజేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలపై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ( kcr )కుటుంబ సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు.వారి అవినీతి సొమ్ము అంతా బయట పెట్టాలని , వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.అంతేకాకుండా వాళ్ళ విదేశీ పాస్పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలని కోరారు.
లేదంటే వారంతా కలిసి ముకుమ్మడిగా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా కేసీఆర్ హయాంలో సీఎంఓ పదవి విరమణ చేసిన అధికారులు కూడా అడ్డగోలుగా కోట్లాది రూపాయల ఆస్తులను ప్రజల నుంచి దోచుకున్నారని, వాళ్ల పాస్పోర్టులు కూడా స్వాధీనం చేసుకొని అవినీతిని బయటపెట్టాలని అన్నారు.
ప్రస్తుతం కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆయన కుదుటపడేవరకు ఈ విషయంలో ఆయనను మాత్రం మినహాయించాలని తెలియజేశారు.ప్రస్తుతం బీఆర్ఎస్(brs) నాయకులు తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ నాయకులకు అప్పజెప్పమనేది అబద్ధమని, ఒకవేళ తెలంగాణ బంగారు పళ్లెంలో ఉంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణను సర్వనాశనం చేశారని హితవు పలికారు.తెలంగాణ అభివృద్ధి చెందూడేమో కానీ ప్రజల సొమ్ము దోచి కేసిఆర్ కుటుంబం బాగా వృద్ధి చెందిందని తెలియజేశారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, దేశవ్యాప్తంగా మోడీ(modi) ఆధ్వర్యంలో బిజెపి(bjp) గాలి వీస్తోందని మొత్తం 350 ఎంపీ స్థానాలతో మూడవసారి కూడా మోడీ అధికారంలోకి రాబోతున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయని అభిప్రాయపడ్డారు.
రాబోవు ఎంపీ ఎలక్షన్స్ లో బిజెపికి కేవలం కాంగ్రెస్ మాత్రమే పోటీ అని బిజెపి ఈ ఎన్నికల్లో లేకుండా పోతుందని తెలియజేశారు.ప్రస్తుతం ఆయన కామెంట్స్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారాయి.