ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్లు వేస్తున్న కేసీఆర్.. కానీ వర్కౌట్ అవుతుందా..?

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడైతే తెరమీదకు వచ్చిందో అప్పటి నుంచి ఓ విషయం మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది.అదే సామాజిక న్యాయం.

తెలంగాణలో దళితులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఈ విమర్శలను తిప్పి కొట్టేందుకు, ఇంకోవైపు హుజూరాబాద్ లో దళితబంధు లాంటి స్కీమ్ ను తెరమీదకు తీసుకువచ్చారు.అయితే ఈ వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కూడా దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకుంది.

దీంతో కేసీఆర్ కూడా అలర్ట్ అయిపోయారు.తన మంత్రి వర్గంలో అసలు మాలలే మంత్రులుగా ఉన్నారు తప్ప ఎస్సీలు లేరనే విమర్శలకు ఎలాగైనా చెక్ పెట్టేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందుకోసం వారికి కూడా సామాజిక న్యాయం చేసేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే మద్యం దుకాణాల్లో వారికి రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చి అందరినీ షాక్ కు గురి చేశారు.

Advertisement

ప్రత్యేకించి ఈ రిజర్వేషన్ల విషయంలో పూర్తి స్థాయి నివేదికల కోసమే లైసెన్స్ గడువునుకూడా పొడిగించడం విశేషం.

అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చి పడుతోంది.ఎందుకంటే ఈ రిజర్వేషన్లను వారు ఉపయోగించుకోవాలన్నా కూడా బడా వ్యాపారులు అయి ఉంటేనే సాధ్యం అవుతుంది.కాగా ఇప్పటి దాకా ఈ వ్యాపారాల్లో అగ్ర కులాలు మాత్రమే ఉన్నాయి.

మరి పెద్దగా ఆర్థిక పరిస్థితులు లేని ఎస్సీలు వారి రిజర్వేషన్లను ఎలా ఉపయోగించుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.కోట్లు వెచ్చిస్తే గానీ ఈ వ్యాపారంలో రాణించలేరని అందరికీ తెలిసిందే.

మరి అణగారిన వర్గాలకు ఈ వ్యాపారంలో రిజర్వేషన్లు ఇచ్చినా పెద్దగా లాభం ఉండదని తెలుస్తోంది.మరి వారికి 10శాతం ఇచ్చిన రిజర్వేషన్ ఏ మేరకు వినియోగించుకుంటారో.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

లేదంటే కేసీఆర్ గౌడ కులస్థులకు ఇచ్చిన 15శాతం రిజర్వేషన్ తో ఏదైనా వ్యతిరేక వస్తుందా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు