తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్ రావు అన్నారు.ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ప్రజలకే లాభమని మంత్రి హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ లో టికెట్లకే దిక్కులేదన్న ఆయన ఆరు గ్యారెంటీలకు దిక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

సమైక్యవాదులతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిపి పోయారని విమర్శించారు.తెలంగాణ ఇచ్చినందుకు అన్నం తినలేదన్న పవన్ కల్యాణ్ తో బీజేపీ పొత్తు పెట్టుకుందన్నారు.

ఇప్పుడు ఈటల రాజేందర్ తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందో చెప్పాలన్నారు.హుజూరాబాద్ లో జీహుజుర్ రాజకీయాలు నడవవన్న మంత్రి హరీశ్ రావు తెలంగాణలో బీజేపీకి మూడు సీట్లు కూడా రావని పేర్కొన్నారు.

Advertisement

రెండు చోట్ల నిలబడ్డ ఈటల రెంటికీ చెడ్డ రేవడి అవుతారని వెల్లడించారు.

వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..
Advertisement

తాజా వార్తలు